యోగి సర్కార్ సంచలన నిర్ణయం

November 06, 2018


img

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ దీపావళి పండుగ ముందు ఒక శుభవార్త వినిపిస్తారని ఆ రాష్ట్ర బిజెపి శ్రేణులు చాలా ప్రచారం చేశారు. వారు చెప్పినట్లుగానే యోగి ఆదిత్యనాధ్ ఒక సంచలన నిర్ణయం ప్రకటించారు. నేటి నుంచి అయోధ్య రామాలయం/ బాబ్రీ మసీదు ఉన్న జిల్లా ఫైజాబాధ్ పేరును అయోధ్య జిల్లాగా మార్చుతున్నట్లు ప్రకటించారు. అయోధ్యకు శ్రీరాముడికి ఉన్న బందం అందరికీ తెలిసిందేనని, కనుక రామాలయం నిర్మించబోయే జిల్లాకు అయోధ్య జిల్లాగా పేరు కలిగి ఉండటమే సబబు అని అన్నారు. అందుకే నేటి నుంచి ఫైజాబాధ్ జిల్లాను అయోధ్య జిల్లాగా పరిగణిస్తామని చెప్పారు. త్వరలోనే అయోధ్యలో శ్రీరాముని పేరిట విమానాశ్రయం, దశరధుడి పేరుతో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని సిఎం యోగి ఆదిత్యనాధ్ తెలిపారు. 

దేశంలో ఎప్పుడు ప్రధాన ఎన్నికలు జరుగుతున్నా బిజెపి తప్పకుండా ప్రస్తావించే అంశం అయోధ్యలో రామాలయ నిర్మాణం. అయితే అది ఎన్నికలకే పరిమితమని అందరికీ తెలుసు.ఆ పేరుతో హిందువులను ఆకట్టుకొని వారి ఓట్లు సంపాదించుకోవడమే దాని లక్ష్యమని అనేకసారు నిరూపితమైంది. త్వరలో నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక బిజెపి మళ్ళీ విజయవంతమైన ఈ ఫార్ములాను అమలుచేస్తున్నట్లుంది. సున్నితమైన ఈ అంశంపై యోగీ ప్రభుత్వం ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వలన ఎన్నికలలో బిజెపికి ఏమైనా లబ్ది కలుగుతుందో లేదో తెలియదు కానీ మత ప్రాతిపదికన ప్రజలను మరింత చీల్చినట్లు అవుతుంది.


Related Post