బైకును డీకొన్న దగ్గుబాటి సురేష్ కారు

October 22, 2018


img

 ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన కారు (ఎస్‌09ఈఎక్స్‌ 2668) ఈరోజు ఉదయం సికింద్రాబాద్ లో ఇంపీరియల్ గార్డెన్ వద్ద ఒక బైకును డీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న దంపతులు సతీష్‌ చంద్ర, దుర్గ దేవి, వారి మూడేళ్ళ కుమారుడు సిద్దేశ్‌ చంద్ర గాయపడ్డారు. వారిలో బాలుడికి కాలు ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. ముగ్గురినీ యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం, సురేష్ బాబు వాహనం  ఇంపీరియల్ గార్డెన్ వైపుగా వెళుతున్నప్పుడు, హటాత్తుగా రాంగ్ రూట్ లో బైకు రోడ్డుపైకి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కారు యజమాని అయిన సురేష్ బాబుపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. Related Post