రూ.10 కోట్లు పట్టివేత

October 20, 2018


img

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా నామినేషన్లు కూడా మొదలవలేదు కానీ అప్పుడే భారీగా డబ్బు మూటలు వచ్చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రోజూ తనికీలు నిర్వహిస్తున్నారు.

ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దులో పిప్పర్ వాడ వద్ద శుక్రవారం పోలీసులు తనికీలు నిర్వహిస్తున్నప్పుడు నాగపూర్ నుంచి వస్తున్న ఒక వాహనంలో రూ.10 కోట్లు నగదు పట్టుబడింది. ఆ వాహనాన్ని నడుపుతున్న వినోద్ శెట్టిని, వాహనంలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి శబరీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనాన్ని, నగదును స్వాధీనం చేసుకొన్నారు.

పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ వాహనంలో వారిరువురూ ఆ డబ్బును నాగపూర్ లోని జామ్ అనే ప్రాంతం నుంచి తీసుకొని హైదరాబాద్‌ తరలిస్తున్నారు. దానిని ఎవరు ఇచ్చారు? ఎవరికి పంపుతున్నారు? అనే వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. పోలీసులు వారిరువురినీ శనివారం అదిలాబాద్ జిల్లా కోర్టులో హాజరుపరిచిన తరువాత కోర్టు అనుమతితో వారిని విచారిస్తారు.


Related Post