రాష్ట్ర బిజెపి ఎన్నికల కమిటీ ఏర్పాటు

October 19, 2018


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ, పేరాల శేఖర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, జి.రామకృష్ణారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, లక్ష్మీ నారాయణ, మంత్రి శ్రీనివాసులు, చింతా సాంబమూర్తి, నాగూరం నమాజీ, చంద్రలిగన్న దొర తదితరులున్నారు. కె. లక్ష్మణ్ అధ్వర్యంలో ఎన్నికల కమిటీ గురువారం సమావేశమైంది.

ఈ సమావేశంలో 35 స్థానాలలో అభ్యర్ధుల ఎంపికపై చర్చించి వారిలో ఆరుగురు పేర్లను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం. మళ్ళీ ఇవాళ్ళ మరోసారి సమావేశమై మిగిలిన స్థానాలపై చర్చించి మరికొంత మంది పేర్లను ఖరారు చేయాలని నిర్ణయించుకొన్నారు. ఈరోజు జరుగబోయే సమావేశంలో కనీసం 25-30 మంది అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనుక ఈరోజు జరుగబోతున్న సమావేశం చాలా కీలకమైనదిగానే భావించవచ్చు.

ఈ సమావేశం ముగిసిన తరువాత కె. లక్ష్మణ్ ఈరోజు సాయంత్రం డిల్లీ బయలుదేరుతారు. ఈ జాబితాపై అధిష్టానంతో చర్చించిన తరువాత శనివారం బిజెపి అధిష్టానం అభ్యర్ధుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. 

నిన్నటి సమావేశంలో ఖరారైనట్లు చెప్పబడుతున్న అభ్యర్ధుల పేర్లు: కరీంనగర్‌: బండి సంజయ్‌, పెద్దపల్లి: గుజ్జుల రామకృష్ణారెడ్డి, ముదోల్‌: రమాదేవి, ఆర్మూర్‌: వినయ్‌రెడ్డి, నిజామాబాద్‌: వై. లక్ష్మీనారాయణ, ఆదిలాబాద్‌: శంకర్‌. 

ఈ లెక్కన ఆ ఆరు స్థానాల నుంచి పోటీ చేస్తున్న బిజెపి-తెరాస అభ్యర్ధులు: 



Related Post