కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో కొత్త అంశాలు

October 17, 2018


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ఏడాది కాలంగా ప్రజలకు కొన్ని హామీలు ఇస్తూనే ఉన్నారు. వాటన్నిటినీ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చేర్చడం ద్వారా వాటి అమలుపై తాము గాలి మాటలు చెప్పడం లేదని నిరూపించుకొన్నారు. సిఎం కేసీఆర్‌ నిన్న తెరాస మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యాంశాలను ప్రకటించిన తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ పోటీగా కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించబోతున్న కొన్ని ముఖ్యాంశాలను ప్రకటించారు. ఆ వివరాలు: 

1. రాష్ట్రంలో మహిళా సంఘాలకు లక్ష రూపాయల్ గ్రాంటు, రూ.10 లక్షల రుణం. దాని వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది.  

2. అభయహస్తం పధకాన్ని పునరుద్దరిస్తాము. 

3. ఆరోగ్యశ్రీ పధకాన్ని పునరుద్దరించి దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తాము. మరో రూ.5 లక్షల జీవిత భీమా కూడా కల్పిస్తాము. 

4. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ ప్రతీ మనిషికి నెలకు 7 కేజీల సన్న బియ్యం, 9 రకాల నిత్యావసర సరుకులను ఇస్తాము. 

5. తెల్లకార్డుదారులకు సంవత్సరానికి 6 ఎల్‌పీజీ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము. 

6. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపు ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్‌ బిల్లులన్నీ చెల్లిస్తాము.


Related Post