ఎన్నికలు మాకు ఒక టాస్క్: కేసీఆర్‌

October 17, 2018


img

సిఎం కేసీఆర్‌ మంగళవారం తెలంగాణభవన్‌లో తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యాంశాలను మీడియాకు వివరిస్తూ, “తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి పరిస్థితులకు, ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. ఈ నాలుగేళ్ళలో అనేక సమస్యలు, సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపధంలో నడిపించగలిగాము. రాష్ట్ర ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. కనుక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని, వివిద వర్గాల నుంచి వచ్చిన వినతులను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని మా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాము.

దీనితో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలవాలనే ఉద్దేశ్యం మాకు లేదు. ఇది కేవలం ప్రజాసంక్షేమం దృష్టిలో ఉంచుకొని రూపొందించబడిన మేనిఫెస్టో. గత నాలుగేళ్ళుగా సాగుతున్న ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఇది కొనసాగింపు మాత్రమే. ఎన్నికలంటే ప్రతిపక్ష పార్టీలకు ఒక గేమ్ కానీ మాకు ఒక టాస్క్. గత ఎన్నికలలో ప్రకటించిన మా మేనిఫెస్టోలో మేము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలుచేశాం. దానిలో లేనివి కూడా అనేకం అమలుచేశాం. మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అదే చేస్తాం,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు. 


Related Post