తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు

October 16, 2018


img

సిఎం కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణభవన్‌లో తెరాస ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశంలో పాల్గొని మేనిఫెస్టోను ఖరారు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని ప్రకటించడం ద్వారా నిరుద్యోగయువతను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది కనుక తెరాస కూడా నిరుద్యోగభృతిని ప్రకటించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అలాగే అన్నీ రకాల పెన్షన్లను రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కనుక తెరాస కూడా పెంచకతప్పదు. అలాగే పేదలకు ఇళ్ళు, తాత్కాలిక ఉద్యోగుల జీతాల పెంపు వంటి హామీలను తెరాస మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది.

వీటన్నిటిపై ఈరోజు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ కె కేశవరావు, కమిటీ సభ్యులతో సిఎం కేసీఆర్‌లోతుగా చర్చించి వాటిలో ఆచరణ సాధ్యమైనవాటిని ఖరారు చేస్తారు. అనంతరం మేనిఫెస్టోలో ముఖ్యాంశాలను ఆయన మీడియాకు వివరిస్తారని సమాచారం.


Related Post