తెరాస అవినీతిపై విచారణ జరుపుతాము: జైపాల్ రెడ్డి

October 15, 2018


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత జైపాల్ రెడ్డి సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెరాస ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో చాలా వరకు తెరాస నేతలు, ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికే ఉపయోగపడుతున్నాయి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడటం లేదు. ఆంధ్రా కాంట్రాక్టర్లలో మెగా కృష్ణారెడ్డికి భారీగా కాంట్రాక్ట్ పనులు ముట్టజెప్పారు. ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే సుమారు 30 శాతం పెంచేసి ప్రజాధనాన్ని లూటీ చేశారు. నేను చెప్పిన ఈ అవినీతి లెక్కలు తప్పయితే కాదని సిఎం కేసీఆర్‌ ను చెప్పమనండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెరాస ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకొంటాము. ఎన్నికల తరువాత కేసీఆర్‌ పరిస్థితి ఏవిధంగా ఉండబోతోందో ఓసారి ఆలోచించుకొంటే మంచిదేమో?” అని అన్నారు.


Related Post