తెరాస ఎమ్మెల్సీ జంప్?

October 15, 2018


img

 తెరాస ఎమ్మెల్సీ రాములు నాయక్‌ త్వరలో పార్టీ వీడబోతున్నారు. ఆయన ఆదివారం హోటల్ గోల్కొండకు వచ్చి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొంటున్నట్లు తెలిపారు. అయితే తనకు ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి శాసనసభకు పోటీ చేయడానికి టికెట్ ఇవ్వాలని కోరారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు కానీ టికెట్ విషయంలో తక్షణమే ఎటువంటి హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీనిపై పార్టీ అధిష్టానంతో చర్చించిన తరువాత తమ నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు. రాములు నాయక్‌ స్వయంగా వెళ్ళి కాంగ్రెస్‌ నేతలను కలిశారు కనుక ఇక నుంచి తెరాసలో ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవవచ్చు. కనుక ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే భావించవచ్చు. Related Post