తెలంగాణ ఓటర్ల వివరాలు

October 15, 2018


img

హైకోర్టు అనుమతితో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఈనెల 12న విడుదల చేసింది. అయితే నామినేషన్ల గడువు ముగిసే వరకు అంటే నవంబర్ 19 వరకు ఈ జాబితాలో తప్పులను సవరించుకోవడానికి అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం రజత్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా వివరాలు:

రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య: 2,73,28, 054

పురుషులు: 1,37,87,920

మహిళలు: 1,35,28, 020

నపుంసకులు: 2,663

సర్వీస్ ఓటర్లు: 9,451

 గతంలో రూపొందించిన ఓటర్ల జాబితా ముసాయిదా కంటే తుది జాబితాలో 11,91,278 మంది ఓటర్లు పెరిగినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. నవంబర్ 19 వరకు కొత్తగా ఎంతమంది ఓటర్లుగా నమోదు అయితే వారందరినీ కూడా ఈ తుది జాబితాలో చేర్చి ఓటు హక్కు కల్పిస్తామని పేర్కొంది. ఆ సంఖ్య ఆధారంగానే డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించబడతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం రజత్ కుమార్ తెలిపారు. 


Related Post