ధర్మాబాద్ కోర్టులో చంద్రబాబుకు ఊరట

October 12, 2018


img

బాబ్లీ కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు నుంచి నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్‌ అందుకొన్న ఏపీ సిఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈరోజు అదే కోర్టులో కాస్త ఊరట లభించింది. తనపై న్యాయస్థానం జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ను రీ-కాల్ చేయాలంటూ ఆయన పెట్టుకొన్న పిటిషనును విచారణకు స్వీకరిచింది. అలాగే ఈ కేసుపై ఈనెల 15వ జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మింహాయింపు నివ్వాలనే ఆయన అభ్యర్ధనను కూడా మన్నించింది. 

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 2010లో చంద్రబాబు నాయుడుతో సహా 16మంది టిడిపి నేతలు నిషేదాజ్నాలు ఉల్లంఘించి ఆ ప్రాంతానికి వెళ్ళినందుకు మహారాష్ట్ర పోలీసులు జూలై 17న వారిపై ఈ కేసు నమోదు చేశారు. కానీ ఆ కేసు విచారణకు సంబందించి ఇంతవరకు తమకు ఎటువంటి నోటీసులు అందలేదని, మీడియాలో వచ్చిన వార్తలను చూసి కోర్టు పట్ల గౌరవంతో విచారణకు హాజరయ్యామని మిగిలినవారు న్యాయమూర్తికి చెప్పుకొన్నారు. చంద్రబాబు నాయుడుకు కూడా అదే కారణంతో ఇంతకాలం కోర్టుకు హాజరుకాలేకపోయారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించుకొన్నారు. 

చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా, ఏపీకి చెందిన సుబ్బారావు ఈరోజు ధర్మాబాద్ కోర్టుకు హాజరయ్యి ఈ రెండు పిటిషన్లపై తమ వాదనలు వినిపించారు. వారి వాదనలతో తృప్తి చెందిన న్యాయమూర్తి చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. 


Related Post