తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు వాతలు

October 11, 2018


img
బీసీ ఓటర్ల జాబితా సిద్దం కాలేదనే నెపంతో పంచాయితీ ఎన్నికలను నిరవదికంగా వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల సంఘం 8 నెలలు ముందుగా జరుగబోతున్న శాసనసభ ఎన్నికలకు మాత్రం చాలా హడావుడిగా ఓటర్ల జాబితాలను సిద్దం చేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే పంచాయతీ ఎన్నికలకు ఒక రూలు శాసనసభ ఎన్నికలకు మరొక రూలు అనుకోవాలేమో? పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసి వాటికి స్పెషల్ ఆఫీసర్లను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎంతగా తప్పు పట్టినప్పటికీ పట్టించుకోకపోవడంతో స్పెషల్ ఆఫీసర్లతో పంచాయతీ పాలనను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైంది. దానిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు, పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ, స్పెషల్ ఆఫీసర్లతో పంచాయతీ పాలనను   రాజ్యాంగ విరుద్దమని తేల్చి చెప్పింది. కనుక ఓటర్ల జాబితాలను సిద్దం చేసి మూడు నెలలోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓటర్ల జాబితా సిదంగా లేదనే కారణంతో ఎన్నికలు వాయిదా వేయడం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్దమని హైకోర్టు స్పష్టం చేసింది.

నేటి నుంచి మూడు నెలలోపుగా అంటే జనవరి 10వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించవలసి ఉంటుందన్న మాట. డిసెంబర్ 7వ తేదీన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. అవి పూర్తి కాగానే  పంచాయతీ ఎన్నికల కోడ్, హడావుడి మొదలవుతాయన్న మాట. 

Related Post