గడువు నిజమే కానీ ఉద్దేశ్యం అదికాదు: కోదండరామ్

October 10, 2018


img

టిజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ 48 గంటలలోగా సీట్లసర్దుబాట్లు చేయాలని లేకుంటే తమ పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తామని మహాకూటమికి డెడ్-లైన్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియా ప్రతినిధి ఆయనను ప్రశ్నించగా  “అవును సీట్ల సర్దుబాట్లు ఆలస్యం అవుతున్న కొద్దీ మహాకూటమి కూడా నష్టపోతుందనే ఉద్దేశ్యంతోనే వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. సీట్ల విషయంలో మేము మొండిపడుతున్నామనే వార్తలలో నిజం లేదు. మేము ఒక మెట్టు దిగైనా మహాకూటమిని నిలబెట్టి తెరాస నిరంకుశపాలనను అంతమొందించాలని భావిస్తున్నాము. అలాగే మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన పార్టీలకు కూడా బాధ్యత ఉంటుంది. కనుక సామరస్యంగా ఈ కార్యక్రమాన్ని ముగించడానికి అందరూ కృషి చేయాలి,” అని అన్నారు.Related Post