తెలంగాణాలో తొలగింపబడిన ఓటర్లు ఎందరంటే....

September 22, 2018


img

ముందస్తు ఎన్నికలు నేపద్యంలో అక్టోబర్ 8లోగా తెలంగాణా రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించవలసి ఉంటుంది కనుక ఎన్నికల సంఘం అధికారులు గడువులోగా ఆ పని పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. జనవరి 2018 నాటికి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2,53,27,785మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 1,32,67,626 మంది, మహిళలు 1,28,66,712 మంది, నపుంసక ఓటర్లు 2,438 మంది ఉన్నారు. 

రాష్ట్రంలో 18-19 ఏళ్ళ మద్య వయసున్న ఓట్లర్లు 2,20,674 మంది ఉన్నారు. నకిలీ ఓట్లు, చనిపోయినవారి పేర్లతో ఉన్న ఓట్లు మొదలైనవి 1,36,964 ఓట్లు జాబితాలో నుంచి తొలగించబడ్డాయి. ఇక నిరంతర ఓటర్ల నమోదు ప్రక్రియలో కొత్తగా నమోదు చేసుకొన్నవారి సంఖ్య 9,45,955. జనవరిలో రూపొందించిన ఈ ముసాయిధా జాబితాలో 2,61,36,776 మంది ఓటర్లున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 8న ప్రకటించబోయే తాజా ముసాయిదా జాబితాలో ఎంతమంది ఓటర్లు ఉంటారో చూడాలి. దాని ప్రకారమే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతాయి.


Related Post