ముందస్తు పిటిషన్లు... ఎన్నో

September 17, 2018


img

ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఉమ్మడి హైకోర్టులో ఈరోజు ఒక పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో ఓటర్ల్ జాబితా పూర్తి స్థాయిలో ఖరారు కానందున ముందస్తు ఎన్నికలను ఆపాలని కోరుతూ కొమ్మిరెడ్డి విజయ్ అనే వ్యక్తి ఈరోజు ఉదయం హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని ఈరోజు మధ్యాహ్నం విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే కారణంతో ముందస్తు ఎన్నికలపై అభ్యంతరం చెపుతూ సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ నిన్ననే మీడియాకు తెలియజేశారు. ఇంతకు ముందు రాపోలు భాస్కర్ అనే న్యాయవాది ముందస్తు ఎన్నికలు రాజ్యాంగ విరుద్దం అంటూ వేసిన పిటిషనునపై విచారణ జరిపిన హైకోర్టు ఈ వ్యవహారంలో రాజ్యాంగ అతిక్రమణ జరుగలేదని, పైగా అసెంబ్లీ రద్దు వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని చెపుతూ కేసు కొట్టివేసింది. కనుక ఈ తాజా పిటిషన్లపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. 



Related Post