రాజకీయాలలో చేరిన ప్రశాంత్ కిషోర్

September 16, 2018


img

కాంగ్రెస్‌, బిజెపి, జెడియు, వైకాపా వంటి అనేక రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాలలో చేరి రాజకీయ నాయకుడిగా మారారు. ఆయన స్వస్థలమైన బీహార్ రాష్ట్రంలోనే ఆయన రాజకీయాలలోకి ప్రవేశించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమక్షంలో ఆదివారం జెడియు పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో బిజెపికి సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్, మరుసటి సంవత్సరం బీహార్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమికి సేవలు అందించి బిజెపి ఓటమికి కారకుడయ్యాడు. యూపీ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి శల్య సారధ్యం చేసి బిజెపికి గెలుపుకు కారకుడయ్యాడు. ప్రస్తుతం ఏపీలో వైకాపాకు వ్యూహకర్తగా సేవలు అందిస్తున్నాడు. ఆయన సూచన మేరకే జగన్మోహన్ రెడ్డి ‘నవరత్నాలు’ పేరిట తొమ్మిది హామీలను ప్రకటించారని సమాచారం. బిహార్ రాజకీయాలలో బిజీ కాబోతున్న ప్రశాంత్ కిషోర్ వైకాపాను నీట ముంచుతాడో పాల ముంచుతాడో చూడాలి. 


Related Post