కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు

September 14, 2018


img

ఇవాళ్ళ మధ్యాహ్నం  డిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి మొత్తం 38 మంది నేతలు హాజరయ్యారు. “రాహుల్ గాంధీ ప్రతీ ఒక్కరితో క్లుప్తంగా మాట్లాడారు. పార్టీ నేతలందరూ తమ గ్రూపురాజకీయాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని రాహుల్ గాంధీ చెప్పారు. త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే బలమైన కాంగ్రెస్‌ అభ్యర్ధులున్న చోట ఆ స్థానాలను పొత్తుల కోసం ఇతర పార్టీలకు వదులుకోనవసరం లేదని రాహుల్ గాంధీ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చాలా అనుకూలమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి కనుక ఈసారి ఎన్నికలలో మేమే గెలిచి అధికారంలోకి రావడం ఖాయం,” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. 

అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పినమాటలలో గ్రూపు రాజకీయాల గురించి తప్ప మిగిలినవి తన స్వంత ఆలోచనలను, అభిప్రాయాలను చెపుతున్నట్లే ఉంది. కనుక కీలకమైన ఈ సమావేశంలో ఏమి నిర్ణయాలు తీసుకొన్నారో ఇంకా తెలియవలసి ఉంది. అభ్యర్ధుల ఎంపిక కొరకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. భక్త చరణ్ దాస్ ఛైర్మన్ గా శర్మిష్ఠ ముఖర్జీ (మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె ), జ్యోతిమణి సెంథిమలై సభ్యులుగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటుచేశారు. 


Related Post