ఉద్యమకారులకు టిఆర్ఎస్‌లో చోటు లేదు అందుకే...

September 14, 2018


img

టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఇవాళ్ళ డిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం భూపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌లో నావంటి ఉద్యమకారులకు చోటు లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన తెలంగాణా ద్రోహులు టిఆర్ఎస్‌ను ఆక్రమించుకొన్నారు. వారందరూ కలిసి నావంటి ఉద్యమకారులను టిఆర్ఎస్‌ నుంచి బయటకు పంపించివేస్తున్నారు. బంగారి తెలంగాణా సాధిస్తానని ప్రజలకు మాయమాటలు చెప్పిన సిఎం కెసిఆర్‌ ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పార్టీని నడిపిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్ళు పూర్తి కావస్తున్నా ఉద్యోగాల భర్తీ చేయలేదు. రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటికీ ప్రజల పరిస్థితులలో ఎటువంటి మార్పు రాలేదు. బంగారి తెలంగాణా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే నమ్మకంతోనే నేను కాంగ్రెస్‌ పార్టీలో చేరాను. నాతో పాటు జిల్లాలోని అనేకమంది టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఒకప్పుడు నిజామాబాద్ నుంచే తెలంగాణా ఉద్యమాలు మొదలయ్యాయి. ఇప్పుడు అదే నిజామాబాద్ నుంచే టిఆర్ఎస్‌ పతనం కూడా ప్రారంభం అవుతుంది,” అని అన్నారు. Related Post