కాంగ్రెస్‌లో చేరబోతున్న సినీ నిర్మాత బండ్ల గణేశ్

September 14, 2018


img

హాస్య నటుడిగా సినీ రంగంలో ప్రవేశించి హటాత్తుగా నిర్మాతగా మారి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారు. ఈరోజు ఆయన డిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మరో విశేషం ఏమిటంటే ఆయన త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో షాద్ నగర్ నుంచి పోటీ చేయాలనుకొంటున్నట్లు సమాచారం. కామెడీ వేశాలౌ వేసుకొనే బండ్ల గణేశ్ హటాత్తుగా నిర్మాతగా మారి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ నేటి పరిస్థితులలో ఆ స్థాయికి ఎదిగినవారి తరువాత గమ్యం సాధారణంగా రాజకీయాలే కనుక బండ్ల గణేశ్ కూడా అదే దారిలో పయనిస్తున్నట్లు భావించవచ్చు. శాసనసభ టికెట్ కూడా సాధించుకోగలిగితే విశేషమే. Related Post