చేవెళ్ళలో టిఆర్ఎస్‌కు తలనొప్పులు

September 13, 2018


img

ఈసారి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు కాలె యాదయ్యకు అవకాశం కల్పించడంతో మాజీ ఎమ్మెల్యే కెఎస్. రత్నం పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆయన చేవెళ్ళలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి తనకు జరిగిన అన్యాయం గురించి వారికి వివరించారు. మంత్రి మహేందర్ రెడ్డి తనకు టికెట్ రాకుండా అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్‌ తనకు టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచి తన సత్తా చూపిస్తానని అన్నారు. Related Post