హైదరాబాద్‌ మెట్రో కబుర్లు

August 18, 2018


img

హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు ప్రారంభించి సుమారు 9 నెలలు అవుతోంది. మొదట్లో రెండు కారిడర్లలో కలిపి  రోజుకు లక్ష మంది ప్రయాణించేవారు. ఆ తరువాత ప్రయాణికుల సంఖ్య రోజుకు 75-80,000 వద్ద స్థిరపడింది. కానీ గత కొన్ని రోజులుగా ఆ సంఖ్య మెల్లగా పెరుగుతోందని మెట్రో ఎండి ఎన్వీఎస్‌రెడ్డి చెప్పారు. ఈనెల 16న రెండు కారిడర్లలో కలిపి  1.07 లక్షల మంది ప్రయాణించేరని తెలిపారు. నగరంలో అన్నీ ప్రధాన ప్రాంతాల మీదుగా మెట్రో సర్వీసులు నడుపుతున్నందున క్రమంగా ప్రజలు మెట్రోలో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారని చెప్పారు.

సెప్టెంబర్ మొదటి వారంలో అమీర్ పేట-ఎల్బీ నగర్ కారిడార్‌లో కూడా మెట్రో సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. అవి ప్రారంభం అయితే మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య రోజుకు 2-2.5 లక్షలకు చేరుకోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని తరువాత అమీర్ పేట-హైటెక్ సిటీ కారిడార్ కూడా ఈ ఏడాదిలోనే  ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. అది కూడా ప్రారంభం అయితే నగరంలో అన్ని ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసినట్లే అవుతుంది. కనుక అప్పుడు మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య మరింత గణనీయంగా పెరుగవచ్చు.


Related Post