శుక్రవారం సాయంత్రం వాజ్‌పేయి అంత్యక్రియలు

August 16, 2018


img

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు రేపు సాయంత్రం డిల్లీలో జరుగుతాయి. దేశరాజకీయాలలో తనదైన ముద్రవేసిన ఆయనను కడసారి దర్శించుకొని శ్రద్ధాంజలి ఘటించేందుకు దేశవిదేశాల నుంకి పలువురు ప్రముఖులు డిల్లీకి తరలివస్తున్నారు. ఆయన మరణానికి సంతాపంగా రేపటి నుంచి ఆగస్ట్ 22వరకు ఏడు రోజులపాటు సంతాపదినాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 

కొద్దిసేపటి క్రితమే ఆయన భౌతికకాయాన్ని కృష్ణ మీనన్ మార్గ్ లోని ఆయన నివాసానికి తరలించారు. రేపు ఉదయం ఆయన భౌతికకాయాన్ని బిజెపి కార్యాలయానికి తరలించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభిమానుల సందర్శనార్ధం ఉంచుతారు. అనంతరం ఆయన అంతిమయాత్ర మొదలవుతుంది. డిల్లీలోని విజయ్ ఘాట్ వద్ద రేపు సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అక్కడే ఆయన స్మారక కేంద్రాన్ని నిర్మించేందుకు 1.5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.



Related Post