గోల్కొండ కోటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

August 15, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇవాళ్ళ 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో రాష్ట్ర పోలీసుల నుంకి గౌరవ వంధానం స్వీకరించిన తరువాత మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా గోల్కొండ కోటపై తెలంగాణా రాష్ట్రానికి చెందిన వివిదరకాల జానపదకళా ప్రదర్శనలు కన్నుల పండుగ జరిగాయి. 

అనంతరం గోల్కొండకోట ఆవరణలో నిర్వహించిన సభలో ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. ఒకప్పుడు సమైక్యరాష్ట్రంలో అన్నీ రంగాలలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణా, ఈ నాలుగేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అనేకానేక చర్యల వలన అన్నీ రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తూ దేశంలో అగ్రస్థానంలో నిలబడగలిగిందని చెప్పారు. నాలుగేళ్లలో తెలంగాణా రాష్ట్రం దేశంలో అన్నీ రాష్ట్రాల కంటే శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోడీ స్వయంగా పార్లమెంటులో ప్రశంసించారని సిఎం కెసిఆర్‌ చెప్పారు. 

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, విద్యుత్ తదితర అన్నీ రంగాల అభివృద్ధికి విశేషకృషి చేస్తోందని చెప్పారు. అదేవిదంగా రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. సిఎం కెసిఆర్‌ తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వాటి వలన రాష్ట్రానికి, ప్రజలకు కలుగుతున్న లాభాలను గణాంకాలతో సహా వివరించారు. నేటి నుంచి రాష్ట్రంలో కాంతి వెలుగు, రైతు భీమా, పాడిరైతులకు గేదెల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. ఇక ముందు కూడా తమ ప్రభుత్వం ఇదే స్పూర్తి, పట్టుదలతో ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు నిరంతర కృషి చేస్తుందని తెలిపారు.


Related Post