పరిపూర్ణాంద స్వామిపై నగర బహిష్కరణ ఎత్తివేత

August 14, 2018


img

శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిపై హైదరాబాద్‌ పోలీస్ కమీషనర్ విధించిన నగర బహిష్కరణను ఎత్తివేస్తున్నట్లు హైకోర్టు ఈరోజు ప్రకటించింది. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తీవ్రంగా స్పందించిన పరిపూర్ణానంద స్వామి, అందుకు నిరసనగా హైదరాబాద్‌ నుంచి యదాద్రి వరకు వేలాదిమంది హిందువులతో కలిసి పాదయాత్ర చేపట్టడానికి సిద్దమయ్యారు. దాని వలన నగరంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే కారణంతో వారిరువురినీ ఆరు నెలలపాటు నగరం నుంచి బహిష్కరించారు. పోలీస్ కమీషనర్ నిర్ణయాన్ని సవాలుచేస్తూ పరిపూర్ణానంద స్వామి వేసిన పిటిషనుపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనపై విదించిన నగర బహిష్కరణను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై నిషేధం ఎత్తివేసింది కనుక బహుశః కత్తి మహేశ్ కూడా హైకోర్టులో పిటిషన్ వేస్తారేమో?


Related Post