జమిలి ఎన్నికలపై ఈసీ రియాక్షన్

August 14, 2018


img

మోడీ సర్కార్ గత ఏడాదిన్నరగా జమిలి ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడుతోంది. దేశంలో కొన్ని పార్టీలు, ప్రభుత్వాలు అందుకు సై అనగా మరికొన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ కేంద్రప్రభుత్వం జమిలి ఎన్నికలకే మొగ్గు చూపుతోంది. ఇదే విషయంపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ వ్రాశారు. కానీ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన వివిపిఏటిలు యంత్రాలు వగైరా తమ వద్ద లేవని కనుక జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని   కేంద్ర ఎన్నికల కమీషనర్ ఓపి రావత్ లేఖ ద్వారా బదులిచ్చారు. అయితే మరొక రెండు-మూడు నెలలలో వివిపిఏటిలు యంత్రాలు ఏర్పాటు చేసుకోగలిగితే ఈ ప్రతిపాదనపై పునః పరిశీలిస్తామని చెప్పారు. 



Related Post