రేపు ఒకేరోజు మూడు పధకాలు ప్రారంభం

August 14, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ రేపు ఆగస్ట్ 15న ఒకేరోజు మూడు పధకాలను ప్రారంభించబోతున్నారని మంత్రి హరీష్ రావు చెప్పారు. బీసీలకు 100 శాతం సబ్సీడీ రుణాలు, ‘కంటి వెలుగు’ పేరిట గ్రామీణులందరికీ ఉచిత కంటి పరీక్షలు, చికిత్సలు, మందులు, కళ్ళజోళ్ళ పంపిణీ, పాడిరైతులకు రాయితీపై గేదెల పంపిణీ పధకాలను ప్రభుత్వం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూడు పధకాలను సిఎం కెసిఆర్‌ మెదక్ జిల్లాలో తుఫ్రాన్ మండలంలోని మల్కాపూర్‌లో ఆగస్ట్ 15న లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. రేపటి నుంచే రాష్ట్రంలో రైతులందరికీ జీవితభీమా సర్టిఫికెట్లు అందింబోతోంది. సిఎం కెసిఆర్‌ పర్యటనకు మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు.   Related Post