ఇదేం పాలన? ప్రొఫెసర్ కోదండరామ్

August 13, 2018


img

తెలంగాణా జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కెసిఆర్ వేసిన మొక్కకు పోలీసు పహరా ఏర్పాటు చేసి, దాని కోసం ప్రత్యేకంగా నీళ్ళ ట్యాంకును ఏర్పాటు చేశారు. కానీ తమ పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలని రైతులు మొరపెట్టుకొంటున్నా పట్టించుకోరు. నీళ్ళ కోసం అంధోళన చేసే రైతులపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఇక ప్రభుత్వంలో పెద్దలకు ఎప్పుడూ ఏ భవనాన్ని కూల్చాలీ..దేనిని కబ్జా చేయాలనే ఆలోచిస్తుంటారు తప్ప రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించరు. బడుగు బలహీనవర్గాల కోసం ఎంతో కృషి చేసిన డాక్టర్ అంబేడ్కర్ పేరిట నగరంలో ఒక స్థూపం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్నప్తి చేస్తున్నాను. లేకుంటే దాని కోసం హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం చేపడతాను. మేము ప్రజాసమస్యలపై అన్నీ పార్టీలతో కలిసి పనిచేసినా, వచ్చే ఎన్నికలలో మా తెలంగాణా జనసమితి ఒంటరిగానే పోటీ చేస్తుంది,” అని అన్నారు. Related Post