డి.శ్రీనివాస్ కొడుకు సంజయ్ అరెస్ట్

August 12, 2018


img

సీనియర్ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్‌ను ఆదివారం నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.   లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను గత వారంరోజులుగా పరారీలో ఉన్నారు. పోలీసులు అతనిపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు ఐపిసి సెక్షన్స్: 342,354,354ఏ,506,509 క్రింద కేసు నమోదు చేశారు. అతనిని ఏసీపీ సుదర్శన్ విచారించిన తరువాత జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. రేపటివరకు అతనిని పోలీస్ కస్టడీలో ఉంటారు. రేపు మళ్ళీ న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది.    


Related Post