ఆ మిషన్‌కు గడువు ఆగస్ట్ 14

July 20, 2018


img

తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులలో మిషన్ భగీరథ ఒకటి. ఈ జూలై నెలాఖరునాటికి దాని పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. కానీ నేటికీ అనేకచోట్ల పనులు పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై సిఎం కెసిఆర్ గురువారం ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన అధికారులతో మాట్లాడుతూ ఆగస్ట్ 14వ తేదీ అర్ధరాత్రిలోగా నూటికి నూరు శాతం పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. పనులు చేయడంలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లపట్ల కటినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్.డబ్ల్యూ.ఎస్.లో పనిచేస్తున్న సురేందర్ రెడ్డిని ఈ ప్రాజెక్టుకు సలహాదారుగా నియమించాలని, ఆ శాఖలో ఉన్న నలుగురు చీఫ్ ఇంజనీర్ల సంఖ్యను తొమ్మిదికి పెంచాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో పెండింగుల్ ఉన్న అన్ని పనులను సమాంతరంగా పూర్తిచేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైనట్లయితే సంబంధిత శాఖల అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకొంటూ ముందుకు సాగాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఎట్టిపరిస్థితులలోకూడా ఆగస్ట్ 15వ తేదీ నుంచి మిషన్ భగీరథ పధకం ద్వారా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు నీళ్ళు అందించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.     



Related Post