జూరాలవద్ద పార్క్ ఏర్పాటుకు నిధులు విడుదల

July 19, 2018


img

మహబూబ్ నగర్ జిల్లాలోని కురువాపూర్ గ్రామానికి సుమారు 10 కిమీ దూరంలో జూరాల ప్రాజెక్టు ఉంది. మహబూబ్ నగర్ పట్టణం నుంచి జూరాల ప్రాజెక్టు సుమారు 60 కిమీ దూరంలో ఆత్మకూరు-గద్వాల్ పట్టణాల మద్యన ఉంది. కృష్ణానదిపై 1995లో నిర్మితమైన ఈ ప్రాజెక్టు సామర్ధ్యం 11.94 టిఎంసిలు. జూరాల వద్ద అందమైన పార్కును నిర్మిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీని నిలుపుకొంటూ ముఖ్యమంత్రి ప్రత్యేకనిధి నుంచి రూ.15 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయానికి నీటిని అందించడమే కాకుండా వాటి వద్ద అందమైన పార్కులను నిర్మించినట్లయితే పర్యాటక ఆకర్షణ కేంద్రాలుగా మార్చవచ్చని సిఎం కెసిఆర్ సూచన మేరకు రాష్ట్ర ఉద్యానవన, మున్సిపల్  మరియు పర్యాటకశాఖల అధికారులు ప్రాజెక్టుల సుందరీకరణ పనులు చేపడుతున్నారు. Related Post