మార్చిలోగా గజ్వేల్-హైదరాబాద్ రైల్ సర్వీసులు

July 11, 2018


img

వచ్చే ఏడాది మార్చిలోగా గజ్వేల్-హైదరాబాద్ నగరం మధ్య రైల్ సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కాచీగూడా నుంచి మనోహరాబాద్ వరకు ప్యాసింజర్ రైళ్ళు నడుస్తున్నాయి. కనుక మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు మరో 31 కిమీ రైల్వే ట్రాక్ నిర్మించినట్లయితే గజ్వేల్ వరకు ఆ రైళ్ళను పొడిగించవచ్చు. మనోహరాబాద్-గజ్వేల్ మద్య రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రైల్వేశాఖకు అప్పగించడంతో ఆ మార్గంలో రైల్వేశాఖ నిర్మాణపనులు మొదలుపెట్టింది. అవి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవవచ్చునని సమాచారం. నిర్మాణపనులు పూర్తయితే, మార్చిలోగా రైల్వేభద్రతా పరీక్షలు నిర్వహించి, ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు. ఆ తరువాత గజ్వేల్- హైదరాబాద్ మద్య రైళ్ళ రాకపోకలు మొదలవుతాయి. ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్ళతో పాటు ఎం.ఎం.టి.ఎస్ రైళ్ళను కూడా నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.  Related Post