ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల ప్రకటన

July 10, 2018


img

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను డిఐపిపి కార్యదర్శి రమేష్ అభిషేక్ మంగళవారం డిల్లీలో ప్రకటించారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ కు ప్రధమస్థానం, తెలంగాణాకు రెండవ స్థానం లభించింది. తరువాత స్థానాలలో హరియానా, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టడానికి అనువైన విధానాలను రూపొందించుకొని వాటిని అమలుచేస్తున్న పద్దతులను బేరీజు వేసి ఈ ర్యాంకులు ఇస్తున్నట్లు రమేష్ అభిషేక్ తెలిపారు. 95 శాతం కంటే ఎక్కువగా సంస్కరణల అమలు చేస్తున్న రాష్ట్రాలను “టాప్ అచీవర్స్”, 90-95 శాతం లోపు రాష్ట్రాలను “అచీవర్స్” , 80-90 శాతంలోపు సంస్కరణల అమలు చేస్తున్న రాష్ట్రాలను “ఫాస్ట్ మూవర్స్, 80 శాతం అమలుచేయగలుగుతున్న రాష్ట్రాలను “ఆస్పైరర్స్” గా విభజించి ఈ ర్యాంకులు కేటాయించినట్లు రమేష్ అభిషేక్ తెలిపారు. 



Related Post