ఇక నుంచి 1వ తేదీనే జీతాలు..పెన్షన్లు

June 23, 2018


img

ఇక నుంచి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ టంచనుగా 1వ తేదీనే జీతాలు..పెన్షన్లు అందుకొంటారు. ప్రభుత్వ ఖజానాతో అనుసంధానమైన ప్రభుత్వ బ్యాంక్ ద్వారా వేతనాలు చెల్లింపు ఒక సంక్లిష్టమైన ప్రక్రియగా ఉండేది. దానిని సరళతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘ఈ-కుబేర్’అనే ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. దానిని ఉపయోగించి పైలట్ ప్రాజెక్టుగా వరంగల్ అర్బన్ జిల్లాలో 18,750 మందికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెన్షన్ల చెల్లిస్తోంది. అది విజయవంతంగా అమలు అవుతుండటంతో జూలై మాసం నుంచి ఈ-కుబేర్ ద్వారానే రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులందరికీ చెల్లింపులు చేయబోతోంది. దీని ద్వారానే హోం మంత్రి నాయిని నర్సింసింహారెడ్డి గార్డులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అంగన్ వాడీ, ఎయిడెడ్, డైలీ వెజ్ వర్కర్లు తదితరులకు చెల్లింపులు చేస్తుంది. ఇక నుంచి దీని ద్వారానే గ్రామ పంచాయితీ నిధులు, మునిసిపాలిటీ, మండల పరిషత్‌ నిధులు, అన్ని రకాల పీడీ అకౌంట్‌ నిధులు, స్కాలర్‌ షిప్‌లు వగైరాలు విడుదల చేస్తుంది. 

దీని కోసం ప్రభుత్వ కార్యాలయాలలో వేతనాల డ్రాయింగ్ అధికారి తమ ఉద్యోగుల పేర్లు, వారి బ్యాంక్ ఖాతా వగైరా వివరాలన్నిటినీ ఈ-కుబేర్ సాఫ్ట్ వేర్ లో నమోదు చేయవలసి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అధికారులు చెప్పారు. ఒకవేళ ఇప్పటికే ఆ వివరాలు నమోదు చేసుకున్నట్లయితే, వాటిలో ఎటువంటి తప్పులు లేవని నిర్ధారించుకోవలసిందిగా కోరారు.


Related Post