తెలంగాణా పోలీసులకు జాతీయ అవార్డు

June 23, 2018


img

తెలంగాణా పోలీస్ శాఖ జాతీయ అవార్డుకు ఎంపికయింది. దేశంలో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తిచేస్తునందుకు గాను తెలంగాణా పోలీస్ శాఖకు బెస్ట్ పోలీస్ వెరిఫికేషన్ అవార్డుని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. తెలంగాణా పోలీసులు కేవలం నాలుగు రోజులలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. వరుసగా మూడవసారి తెలంగాణా పోలీస్ శాఖ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం. తెలంగాణా తరువాత స్థానాలలో ఆంధ్రప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి.  

ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే తెలంగాణా పోలీస్ శాఖా పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసమే ప్రత్యేకంగా ‘వెరీ ఫాస్ట్’ అనే ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించుకుని వినియోగిస్తోంది. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2018 మార్చి 31 వరకు మొత్తం 4,29,597 పాస్ పోర్ట్ వెరిఫికేషన్లను పూర్తిచేయడంతో తెలంగాణా పోలీస్ శాఖకు ఈ అవార్డు మళ్ళీ లభించింది. ఈ నెల 24వ తేదీన డిల్లీలో నిర్వహించే “పాస్ పోర్ట్ దివస్” కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోవడానికి రావలసిందిగా విదేశీ వ్యవహారాల శాఖ రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్ రెడ్డిని ఆహ్వానిస్తూ లేఖ పంపించింది. 



Related Post