వికారాబాద్ తెరాస నేతలు రాజీనామాలు!

June 21, 2018


img

తెలంగాణాలో తిరుగులేని రాజకీయశక్తి ఏదంటే తెరాస అని చెప్పుకోవలసిందే. అధికారంలో ఉన్న అటువంటి బలమైన పార్టీలో రాజీనామాలపర్వం మొదలవడం ఆశ్చర్యకరమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం మండలం మాజీ తెరాస కన్వీనర్ పగడాల కరుణాకర్ రెడ్డి బుధవారం తెరాస ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయాగా, ఇవాళ్ళ వికారాబాద్ జిల్లా తెరాస ఉపాధ్యక్షుడు బి.ఎస్. ఆంజనేయులుతో పాటు జిల్లాలో ముజాహిత్ పూర్ ఉప సర్పంచ్ ఎల్లమ్మ, వార్డు సభ్యులు నర్సింహులు, పెద్ద పెంటయ్య, బాబయ, తెరాస గ్రామ కమిటీ నేతలు బాలకృష్ణ, సోమలింగం, అజ్మత్, బిచ్చయ్య గౌస్ తదితరులు రాజీనామాలు చేశారు. త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి కనుక ఇటువంటి పరిణామాలు మామూలే. కానీ తెరాసకు రాజీనామాలు చేస్తున్నవారందరూ ఒకే కారణం చెపుతుండటమే ఆలోచింపజేస్తోంది. తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న తమను పట్టించుకోకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కనుక ఈ సమస్యపై తెరాస అధిష్టానం ఆలోచించడం మంచిదేమో? లేకుంటే తెరాస నుంచి తెలంగాణా జనసమితిలోకి వలసలు మొదలయ్యే ప్రమాదం ఉంది.      



Related Post