ఏపి, టి-ఎన్జీవోల మద్య ఘర్షణ

June 18, 2018


img

ఆంధ్రప్రదేశ్, భాగ్యనగర్ ఎన్జీవోలు నిన్న ఒకరినొకరు కొట్టుకొనే స్థాయిలో ఘర్షణ పడ్డారు. హైదరాబాద్ లోని అబీడ్స్ లోగల ఏపి ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఇరువర్గాలు సమావేశమయ్యాయి. గత ప్రభుత్వం ఉద్యోగులకు గచ్చిబౌలిలో కేటాయించిన స్థలాల గురించి చర్చించడానికి ఆ సమావేశం ఏర్పాటయింది. దాని గురించి చర్చిస్తున్నప్పుడు, వాటిని తెలంగాణా ఉద్యోగులకు దక్కకుండా ఏపి ఎన్జీవో నేతలు అడ్డుపడి దోచుకుతింటున్నారని భాగ్యనగర్ ఎన్జీవో ప్రతినిధులు ఆరోపించడంతో సమావేశంలో ఉద్రిక్తపరిస్థితి ఏర్పడింది.

ఏళ్ళు గడుస్తున్నా ఆ భూములను తెలంగాణా ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడంలేదని, ఈ సమస్యలన్నీ చర్చించడానికి జనరల్ బాడీ మీటింగ్ ఎందుకు నిర్వహించడంలేదని భాగ్యనగర్ ఎన్జీవోలు ఏపి ఎన్జీవో ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అశోక్ బాబులను గట్టిగా నిలదీశారు. ఏపి ఎన్జీవో నేతలు సొసైటీకి చెందిన కోట్లాది రూపాయలు దోచుకుతింటున్నారని వారు ఆరోపించారు. దాంతో ఇరువర్గాల మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఆ సందర్భంగా ఒకరినొకరు తోసుకొన్నారు. ఆ ఘర్షణలో కార్యాలయంలో ఫర్నీచర్ ద్వంసం అయ్యింది. అనంతరం ఇరువర్గాలు అబీడ్స్ పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు పిర్యాదులు చేసుకున్నారు.

      



Related Post