మంత్రి కేటిఆర్ కు జర్మనీ ఆహ్వానం

June 16, 2018


img

జర్మనీలోని ఇండో-జర్మన్ కో-ఆపరేషన్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్ అనే సంస్థ రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ను జర్మనీ రావలసిందిగా ఆహ్వానించింది. ఈనెల 25 నుంచి 27 వరకు జర్మనీలో పర్యటించి తమ విత్తనోత్పత్తి కేంద్రాలలో పర్యటించి అధ్యయనం చేయవలసిందిగా ఆహ్వానించింది. ఆ సందర్భంగా జూన్ 26వ తేదీన బెర్లిన్ లో జరిగే వరల్డ్ ఫుడ్ కన్వెన్షన్ కు కూడా హాజరు కావాలని కోరింది. ఈ విత్తనోత్పత్తి కేంద్రాలలో పర్యటించడం వలన తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పటు చేయబోతున్న విత్తనోత్పత్తి పార్కుకు అవసరమైన అన్ని రకాల సమాచారం లభిస్తుందని తెలిపింది. దీనిపై మంత్రి కేటిఆర్ ఇంకా స్పందించవలసి ఉంది. ఒకవేళ కేటిఆర్ జర్మనీ వెళ్ళదలచుకుంటే ఉద్యానవన, వ్యవసాయశాఖలకు చెందిన అధికారులను తీసుకువెళ్ళవచ్చు,           



Related Post