సిరిసిల్లాలో వ్యవసాయ యూనివర్సిటీకి శంఖుస్థాపన

June 13, 2018


img

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్దాపూర్ వద్ద నిర్మించబోతున్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బుధవారం మంత్రులు కేటిఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ విశ్వవిద్యాలయానికి తెలంగాణా సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరును ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్, జిల్లా తెలంగాణా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెరాస నేతలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, “రాబోయే 6 నెలలలోగా జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాము. ఇప్పటికే మా ప్రభుత్వం రైతుబందు పధకం అమలుచేసింది. ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత జీవితభీమా చేయిస్తున్నాము.మా ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి పధకాలు అన్నీ పూర్తయితే ఇక రాష్ట్రంలో సాగునీటికీ ఎన్నడూ కొరత ఉండదు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకొని మా ప్రభుత్వం రేయింబవళ్ళు పనిచేస్తోంది. రైతుల సంక్షేమం కోసం మా ప్పా అనేక చర్యలు చేపడుతోంది. వాటి ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపించడం మొదలయింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా ఒక యజ్ఞంలా సాగుతుంటాయి,” అని చెప్పారు.         Related Post