ఎన్టీఆర్ పేరుకు అప్రదిష్ట కలిగించను: కేటిఆర్

May 24, 2018


img

‘ఎన్టీఆర్ పేరుకు అప్రదిష్ట కలిగించను.’ ఈమాట అన్నది ఏ తెదేపా నాయకుడో లేదా అయన వంశస్తులో కాదు. రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్. అయన పూర్తిపేరు కె. తారక రామారావు అని అందరికీ తెలిసిందే. సిఎం కెసిఆర్ కు మహానటుడు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అందుకే తన కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, గురువారం హైదరాబాద్ లోని బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ లో అడ్వాన్స్ బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను మంత్రి కేటిఆర్, బాలకృష్ణ కలిసి  ప్రారంభించారు. ఆ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ, “క్యాన్సర్ రోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలంటే బాలకృష్ణకు మించిన బ్రాండ్ అంబాసిడర్ మరొకరు ఉండరు. మానాన్న గారు ఎన్టీఆర్ అభిమాని. నేను బాలకృష్ణగారి అభిమానిని. ఎన్టీఆర్ పేరు నాకు పెట్టారు కనుక నావలన అయనకు చెడ్డపేరు రానీయను,” అని అన్నారు. 

ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ ఇద్దరూ అందరికీ తెలిసిన కారణాల చేత శత్రువులలాగ ఒకరికొకరు దూరంగా ఉంటారు. కానీ కెసిఆర్ కుమారుడు కేటిఆర్, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ మాత్రం సన్నిహితంగా మెలుగుతుండటం విశేషం. 


Related Post