కాంగ్రెస్-జెడిఎస్ పదవుల పంపిణీ

May 22, 2018


img

కాంగ్రెస్-జెడిఎస్ పార్టీల మధ్య పదవుల పంపకాలపై రాహుల్ గాంధీ- కుమారస్వామి ల మద్య జరిగిన చర్చలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 22, జెడిఎస్ కు ముఖ్యమంత్రి పదవితో సహా మొత్తం 12 మంత్రి పదవులు తీసుకోవడానికి అంగీకారం కుదిరింది. ఒప్పందం ప్రకారం కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవి లభించాయి. బుధవారం సాయంత్రం వారిరువురు మాత్రమే ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ కార్యక్రమానికి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. 

గురువారం కుమారస్వామి ప్రభుత్వం గురువారం శాసనసభలో బలనిరూపణ చేసుకున్నాక మంత్రులకు శాఖల కేటాయింపు చేయాలని కాంగ్రెస్, జెడిఎస్ నిర్ణయించాయి.  

ఈ నెల 25న స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక నిర్వహించి స్పీకర్‌ పదవికి కెఆర్‌ రమేశ్‌ కుమార్‌ (కాంగ్రెస్)ను, డిప్యూటీ స్పీకర్ పదవికి జెడిఎస్ నేతను ఎన్నుకొంటారు. 


Related Post