కుచ్ దిన్ కా సుల్తాన్

May 19, 2018


img

ఎడ్యూరప్ప 2007లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు 8వ రోజునే తన పదవికి రాజీనామా చేశారు. ఈసారి ఆయన తన రికార్డును తనే బ్రేక్ చేసుకొని 3వ రోజు పూర్తికాక మునుపే కుర్చీలో నుంచి దిగిపోయారు. అయితే మన దేశంలో ఇంకా అనేకమంది అటువంటి ఘనులున్నారు. వారిలో కొందరు విశ్వాసపరీక్షలో నెగ్గలేక దిగిపోగా, మరికొందరు రాజకీయ సంక్షోభం కారణంగా దిగిపోయారు. 

ఈవిషయంలో ఎడ్యూరప్పకు తీసిపోని వ్యక్తి యూపి మాజీ ముఖ్యమంత్రి జగదాంబికా పాల్. అయన 1998, ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మూడోరోజు పూర్తికాకమునుపే పదవిలో నుంచి దిగిపోయారు. 

అతి తక్కువ సమయం ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు:       

1. సతీశ్ ప్రసాద్ సింగ్ (బిహార్) : 5వ రోజు రాజీనామా (1968, జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు)

2. ఓం ప్రకాష్ చౌతాలా (హరియాణా) : 6వ రోజు రాజీనామా (1990, జులై 12 నుంచి 17వరకు)

3. నితీష్ కుమార్ (బిహార్) ‌: 8వ రోజు రాజీనామా (2000, మార్చి 3 నుంచి 10వరకు)

4. యడ్యూరప్ప (కర్ణాటక) : 8వ రోజు రాజీనామా (2007, నవంబర్ 12 నుంచి 19వరకు)

5. ఎస్.సీ మరాక్ (మేఘాలయ) : 12వ రోజు రాజీనామా (1998, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10వరకు)

6. ఓం ప్రకాష్ చౌతాలా (హరియాణా) : 17వ రోజు రాజీనామా  (1991, మార్చి 21 నుంచి ఏప్రిల్ 6వరకు)

7. జానకీ రామచంద్రన్ (తమిళనాడు) : 24వ రోజు రాజీనామా (1988, జనవరి 7 నుంచి 30వరకు)

8. బీపీ మండల్ (బిహార్) : 31 రోజులు (1968, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2వరకు)


Related Post