బ్రేకింగ్ న్యూస్: ఎడ్యూరప్పకే ఛాన్స్!

May 16, 2018


img

కర్ణాటక ఎన్నికల అనంతరం ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో ఈరోజు సాయంత్రం మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఆ రాష్ట్ర గవర్నర్ వాజూ భాయ్ వాలా ఎడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు. దీంతో ఎడ్యూరప్ప రేపు ఉదయం9.30 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్-జెడిఎస్ పార్టీలు భగ్గుమన్నాయి. ఆ రెండు పార్టీలు కలిసి రేపు ఉదయం రాజ్ భవన్ ముందు లక్షమంది కార్యకర్తలతో ధర్నా చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రేపే సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్దం అవుతోంది. ఎడ్యూరప్ప బలనిరూపణకు గవర్నర్ వారం రోజులు సమయం ఇచ్చినట్లు సమాచారం.      Related Post