జూబ్లీ బస్ స్టాండ్ లో ప్రమాదం

May 16, 2018


img

సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ లో మంగళవారం రాత్రి చిన్న ప్రమాదం జరిగింది. నల్గొండ నుంచి వచ్చిన పికెట్ డిపోకు చెందిన ఆర్టీసి బస్సును పార్కింగ్ చేస్తుండగా అది అదుపుతప్పి పక్కనే ఉన్న గణేష్ టిఫిన్ సెంటరులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో  హోటల్ లో పని చేస్తున్న రాజన్ తో పాటు, హోటల్లో భోజనం చేస్తున్న నిజామాబాద్ కు చెందిన కన్నయ్య అనే వ్యక్తి గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ను రప్పించి వారిరువురినీ గాంధీ ఆసుపత్రికి పంపించారు. ఈ సంగతి తెలుసుకొన్న మారేడుపల్లి పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని బస్సు డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

బస్సు జూబ్లీ బస్ స్టాండ్ చేరుకొన్న తరువాత బస్సు డ్రైవర్ దానిని క్లీనర్ కు అప్పజెప్పడం వలననే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. బస్సు నడపడంలో అనుభవంలేని క్లీనర్ హరి బ్రేకు పెడల్ కు బదులు యాక్సిలేటర్ పెడల్ పై కాలువేయడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు.  

   Related Post