తెలంగాణాలో మరో మంచి పధకం

May 16, 2018


img

తెలంగాణాలో వివిధ వర్గాల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్తకొత్త సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతూ, వాటిని సమర్ధంగా అమలుచేసి చూపిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా మరో సంక్షేమ పధకం అమలుకు సిద్దం అవుతోంది. 

రాష్ట్రంలో రైతులందరికీ సామూహిక భీమా (గ్రూప్ ఇన్స్యూరెన్స్) చేయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ప్రతీ రైతుపేరిట రూ.5లక్షలు ఇన్స్యూరెన్స్ చేయించడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. చిన్నా, పెద్దా అనే తేడా చూపకుండా రాష్ట్రంలో రైతులందరికీ ఎల్.ఐ.సి.సంస్థ. ద్వారా జీవితభీమా చేయించాలని, వారి భీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని, అందుకు అవసరమైన సొమ్మును మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఎవరైనా రైతు మరణించినట్లయితే, తక్షణమే ఎల్.ఐ.సి.సంస్థ ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షలు భీమాసొమ్మును చెల్లించే విధంగా విధివిధానాలు, ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

దేశంలో వివిధ పరిశ్రమలు, వ్యాపార సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఆయా సంస్థల యాజమాన్యాలు ఈవిధంగా ‘గ్రూప్ ఇన్స్యూరెన్స్’ తీసుకొనే పద్ధతి ఎప్పటి నుంచో అమలులో ఉంది. అలాగే పంటలకు కూడా భీమా చేయించే పద్ధతి కూడా అమలులో ఉంది. కానీ ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా మొత్తం రైతులందరికీ ప్రభుత్వాలు జీవితభీమా చేయించలేదు. ఈవిషయంలో కూడా తెలంగాణా రాష్ట్రామే ముందు నిలిచి ఇతర రాష్ట్రాలకు ప్రేరణ కలిగించబోతోంది. బహుశః మరో ఒకటి రెండు నెలలోనే ఈ పధకం కూడా రాష్ట్రంలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. 


Related Post