ఇదేమి ట్విస్ట్ అబ్బా!

May 15, 2018


img

కర్ణాటక ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. వాటిలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించలేకపోయింది. కనుక జెడిఎస్ మద్దతు కోసం మంతనాలు మొదలుపెట్టింది. కానీ ఈసారి భాజపా కంటే కాంగ్రెస్ నేతలు చురుకుగా, తెలివిగా వ్యవహరించి జెడిఎస్ మద్దతుకోరే బదులు దానికే తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జెడిఎస్ అధినేత కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేయడంతో ఆ రెండు పార్టీల నేతలు కలిసి ఈరోజు సాయంత్రం గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం కల్పించవలసిందిగా కోరబోతున్నారని తాజా సమాచారం. విజయోత్సాహంతో సంబరాలు చేసుకొంటున్న భాజపాకు కాంగ్రెస్ పార్టీ ఊహించని ఈ ట్విస్ట్ తో పెద్ద షాకే ఇచ్చింది. కానీ ఇంకా సమయం ఉంది కనుక ఈలోగా భాజపా కూడా చక్రం తిప్పే అవకాశం లేకపోలేదు.


Related Post