యూపిలో ఘోరరైలు ప్రమాదం

April 26, 2018


img

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. యూపిలో కుషినగర్ అనే పట్టణంలో బాపూర్వ అనే ప్రాంతంలో గల అరక్షిత రైల్వే లెవెల్ క్రాసింగ్ లో ఒక స్కూలు బస్సును రైలు డ్డీ కొనడంతో 13 మంది చిన్నారులు చనిపోయారు. మరో 8మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురువారం ఉదయం 7.10 గంటలకు జరిగింది. 

ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం స్థానిక డివైన్ మిషన్ స్కూల్ కు చెందిన మినీ వ్యాన్ విద్యార్ధులను తీసుకొని స్కూలుకు వెళుతుండగా, రైలు వస్తోందని స్థానికులు హెచ్చరిస్తున్నప్పటికీ బస్సు డ్రైవర్ ఆగకుండా ముందుకు వెళ్ళడంతో ఈ ఘోరప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అభంశుభం తెలియని 13మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. 

ఈ ప్రమాదం సంగతి తెలుసుకొన్న పోలీసులు, అధికారులు తక్షణమే అక్కడకు చేరుకొని తీవ్రంగా గాయపడిన విద్యార్ధులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యూపి ముఖ్యమంత్రియోగి ఆదిత్యనాథ్ చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 


Related Post