ఆనం వివేకానందరెడ్డి మృతి

April 25, 2018


img

తెదేపా నేత ఆనం వివేకానంద రెడ్డి (67) బుధవారం ఉదయం మృతి చెందారు. అయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే తీవ్ర అస్వస్థత చెందడంతో నెల్లూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొన్నారు. వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు అయన మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ విఅద్యులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆయన ఆరోగ్యపరిస్థితి క్షీణిస్తూనే ఉంది. బుధవారం ఉదయం అయన చనిపోయినట్లు కిమ్స్ వైద్యులు దృవీకరించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికా శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆనం సోదరులిద్దరూ ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత వారిరువు తెదేపాలో చేరారు.Related Post