సుప్రీంకోర్టులో మళ్ళీ వివాదం

April 25, 2018


img

దేశంలో న్యాయవివాదాలను పరిష్కరించాల్సిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కానీ దానిలోనే వివాదాలు పుట్టుకువస్తుండటం, ఆ కారణంగా న్యాయమూర్తులే ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై తిరుగుబాటు చేయడం, తాజాగా కాంగ్రెస్ తో సహా ఏడు రాజకీయ పార్టీలు ఆయనపై పార్లమెంటులో అభిశంశన జరపాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు నోటీసు ఇవ్వడంవంటి పరిణామాలన్నీ జరిగాయి. అభిశంశన నోటీసును తిరస్కరించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించామని కేంద్రం నిట్టూర్పు విడిచేలోగా మరొక ఉపద్రవం ముంచుకువచ్చింది. 

“సుప్రీంకోర్టులో నెలకొన్న సమస్యలపై న్యాయస్థానం భవిష్యత్ గురించి చర్చించేందుకు తక్షణమే ‘ఫుల్ కోర్టు’ను సమావేశపరచవలసిందిగా కోరుతున్నాము,” అని ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రంగాన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్ రెండు లైన్లతో కూడిన ఒక లేఖనుప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు వ్రాసారు. దీంతో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు మిగిలిన న్యాయమూర్తులకు మద్య నెలకొన్న విభేదాలు మళ్ళీ మరోమారు బయటపడ్డాయి. ఈ పరిణామాలన్నీ సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్టను మసకబార్చేవేనని చెప్పక తప్పదు.


Related Post