ధర్డ్ ఫ్రంట్ పై ప్లీనరీలో కీలక నిర్ణయం

April 23, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి, దానికోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఏప్రిల్ 27న కొంపల్లిలో జరుగబోయే తెరాస ప్లీనరీ సమావేశాలలో ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే తెరాసలో కెసిఆర్ నిర్ణయమే అంతిమ నిర్ణయమని దానికి తిరుగులేదని అందరికీ తెలుసు. అందుకే ఆయన ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించగలిగారు. కనుక తెరాస ప్లీనరీలో ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించడం అంటే కెసిఆర్ నిర్ణయానికి లాంఛనంగా పార్టీ చేత ఆమోదముద్ర వేయించుకోవడమేనని భావించవచ్చు. అయితే ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ దానికి ఆశించిన స్థాయిలో ఇతర పార్టీల నుంచి ప్రోత్సాహం లభించకపోవడం, భాజపాను వ్యతిరేకించే పార్టీలను కూడగట్టి మహాకూటమి ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు, ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు మొదలైన కారణాల చేత ఒకవేళ కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనను విరమించుకోదలిస్తే ‘పార్టీ నిర్ణయం మేరకు’ అని చెప్పి గౌరవంగా వెనక్కు తగ్గే అవకాశం కూడా ఉంది.                          



Related Post