కోమటిరెడ్డి కేసు..మరో ట్విస్ట్!

April 21, 2018


img

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాల రద్దు కేసులో రోజుకో కొత్త పరిణామం ఏర్పడుతోంది. వారి సభ్యత్వాల రద్దును కొట్టివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది తెరాస ఎమ్మెల్యేలు హైకోర్టు డివిజన్ బెంచిలో ఒక రిట్ పిటిషన్ వేసి, దీనిపై అత్యవసరంగా విచారణ జరిపించాలని కోరారు. కానీ హైకోర్టు ధర్మాసనం వారి అభ్యర్ధనను త్రోసిపుచ్చింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఏమీ జరుగడం లేదు కనుక ఈ కేసును అత్యవసరంగా విచారించవలసిన అవసరంలేదని తెరాస న్యాయవాదికి తెలిపింది. కానీ వచ్చే బుధవారం దీనిపై ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. 



Related Post